Garloddu Laxmi Narasimha Swami Temple
Garloddu Laxmi Narasimha Swami Temple
Oct 14, 2021
హిందూ ధర్మం లో స్త్రీ పురుషులు ఇరువురికి సమాన ప్రతిపత్తి, గౌరవం ఇవ్వబడ్డాయి.అందుకు ఉదాహరణ మనం కొలిచే దేవతా మూర్తుల రూపాలే.క్రింద సింహం,పైన కన్యా రూపంలో పార్వతి దేవి అవతారమైన దుర్గాదేవి ,పెద్దమ్మ తల్లిని కొలుస్తుంటే,పైన సింహం,క్రింద నర రూపం లో విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి ని కొలుస్తున్నాం.కాబట్టి విష్ణుమూర్తి,పార్వతి దేవి రూపాలు అన్నా చెలెళ్లు గా భారత దేశం లో అనేక ప్రాంతాల్లో పూజలు అందుకుంటున్నారు.అలాంటి చెల్లెలికి ప్రతిరూపంగా తెలంగాణ లో బతుకమ్మ తల్లి పేరుతో,పూవుల తల్లిగా పార్వతి మాత పూజలు అందుకుంటుంది.ఆ తల్లి యే గార్లఒడ్డు గ్రామం లో పుట్టింటి పెద్దమ్మ తల్లిగా తన సోదరుడు అయినా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పుట్టింటి ఆచారంగా వైష్ణవ సంప్రదాయం లో పూజలు అందుకోవడం గమనార్హం.పురుషులకు ఒకటే ఇల్లు.కానీ స్త్రీలకు 2 ఇండ్లు.ఒకటి పుట్టినిల్లు.2 మెట్టి నిల్లు. ఒక ఇంట్లో ఆమె శక్తి అయితే మరొక ఇంటిలో ఆమె లక్ష్మి.ఇలా అన్నా చెల్లెల్లు ఒకే ప్రాంగణం లో ప్రక్కప్రక్కనే పూజలు అందుకోవడం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మరియు పుట్టింటి పెద్దమ్మ తల్లి విశిష్టత.ఈ క్షేత్రం లోని మూర్తులను దర్శించి కొలిస్తే,తప్పకుండా కుటుంబ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి.గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు పుట్టింటి పెద్దమ్మ తల్లి ఆశీసులు అందరికి ఉండాలని కోరుకుంటూ ,అందరికి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తో...... మద్దిగుంట నరసింహా రావు. B.A.B.L వ్యవస్థాపక ధర్మకర్త. శ్రీ లక్ష్మి నరసింహా స్వామి దేవస్థానం. గార్లఒడ్డు. ఏనుకూరు మండలం,ఖమ్మం జిల్లా
Book